📢 Advertisement Space

శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఐ స్వామి నాయుడు

🗞️ బిబి న్యూస్ | 21 Feb 2026

కసింకోట, ఫిబ్రవరి 21: కశింకోట శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కశింకోట సీఐ స్వామి నాయుడు హాజరయ్యారు.విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వామి నాయుడు విద్యా విధానాలు, యువతలో ఉత్సాహం పెంపు, ఇంగ్లీష్ విద్యా ప్రాముఖ్యతపై చర్చించారు.స్కూల్ నిర్వాహకులు, టీచర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం సిఐ స్వామి నాయుడు మాట్లాడుతూ విద్యా రంగంలో విద్యార్థులు మరింత ఎత్తుకు ఎదగాలని ఉన్నత ఉద్యోగాలు చేపట్టాలని, యువతకి ప్రేమ మీద వ్యామోహం వద్దు అని చదువుపై ఆసక్తి పెట్టుకోండి భవిష్యత్ ఉంటుందని సీఐ స్వామి నాయుడు పిలుపునిచ్చారు.