📢 Advertisement Space

అండర్-16 వాలీబాల్ ఎంపికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొణతాల

🗞️ బిబి న్యూస్ | 21 Feb 2026

అనకాపల్లి, గవరపాలెం, దెబ్బ వీధి, సీతారామ దేవస్థానం అసోసియేషన్ ద్వారా కొబ్బరి తోటలో ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ నిర్వహించిన అండర్-16 బాలురకు శిక్షణ కార్యక్రమంలో కలకత్తా బెంగాల్‌లో జరగబోయే జాతీయ వాలీబాల్ పోటీలకు 14 మందిని ఎంపిక చేసిన సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యుడు శ్రీ కొణతాల రామకృష్ణ విచ్చేశారు. చాలామంది క్రీడాకారులను తయారు చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన అందరికీ అభినందించారు.ఈ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకు మంచి భవిష్యత్తు ఉండాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అమ్మవారి ఆశీస్సులు, నాగేంద్ర స్వామి ఆశీస్సులు లభించాలని కోరారు.అనంతరం, వాలీబాల్ టోర్నామెంట్‌కు ఎంపికైన బాలబాలికలకు బహుమతులు అందజేసి అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.