📢 Advertisement Space

మార్చి 8 న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ప్రారంభోత్సవం

🗞️ బిబి న్యూస్ | 22 Feb 2026

ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రాంత ప్రజలు పూజిస్తున్నటువంటి శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తయి కలస స్థాపన వచ్చే నెల మార్చి 8వ 2026 తారీఖున ఉదయం 10:58 నిమిషాలకి ముహూర్తం నిర్ణయించబడ్డది అనే మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ తెలియజేశారు.ఈ నిర్మాణ కార్యక్రమం 2022లో మొదలై ఇప్పటివరకు 4 సంవత్సరాల్లో పూర్తయి ఈ ఏడాది కొత్త అమావాస్యకి అమ్మవారు అందరికీ దర్శనం ఇస్తారని,గత ఏడాది గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా ప్రకటించబడిన సందర్భంగా ప్రజల సహకారంతో కమిటీ మెంబర్లు కలిపి ఎంతో వైభవంగా ప్రతిష్టను కాపాడుతూ ఉత్తరాంధ్ర,ఈ ప్రాంత, అనకాపల్లి ప్రాంత పండుగ కలస స్థాపన మూలవిరాట్ పూజా కార్యక్రమం జరుగుతాయని ఈ కార్యక్రమంలో భాగంగా
మార్చి 5వ తారీఖున మొదలై అమ్మవారి పడిష కళసల ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది. మార్చి 6,7 తారీఖుల లో చండీయాగం ఇతర హోమ కార్యక్రమం జరుగుతుందని మార్చి 8 తారీకు ఉదయం 10 :58 నిమిషాలకి పూర్ణాహుతో కలస స్థాపన జరగడం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి గౌరవం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని దేవాదాయ శాఖ మంత్రి,జిల్లా మంత్రి,ఇంచార్జి మంత్రి, ఉత్తరాంధ్ర శాసనసభ్యుల్ని ఆహ్వానించడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సంపూర్ణ సహకారాన్ని అందించి పూర్వవైభవాన్ని తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు యధావిదంగా పాల్గొనాలని తెలియజేశారు.ఇప్పటివరకు గర్భాలయ ప్రాంగణం అభివృద్ధి చేయడం జరిగిందని తర్వాత ప్రాంగణం చుట్టూ మార్పులు చేయాలని చుట్టూ కాంపౌండ్ వాల్ మరికొన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆలోచనతో ఉన్నామని దీని నిమిత్తం ప్రభుత్వానికి నివేదిక పంపామని, ప్రభుత్వ ఆమోదం తెలపగానే ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం పునః ప్రతిష్ట రాజగోపుర ప్రతిష్ట మరియు మహాసంప్రోక్షణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి అమ్మవారి రధాన్ని ప్రారంభించారు.