విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ద్వారపురెడ్డి పరమేశ్వరరావుకు అరుదైన గౌరవం
🗞️ బిబి న్యూస్ | 02 Aug 2026
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావుకు అరుదైన గౌరవం దక్కింది.ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సమీపంలో నిలిచి స్వాగతం పలికే అవకాశం లభించడం అనకాపల్లి జిల్లా ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఫోటోలు అందుకోవడం విశేషంగా నిలిచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఈ గౌరవం లభించడం జిల్లా బీజేపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది.