📢 Advertisement Space

AP Gen-Z WAR రిలే నిరాహార దీక్షలు.. యువత సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ డిమాండ్

🗞️ బిబి న్యూస్ | 06 Aug 2026

అనకాపల్లి జిల్లా, నాతవరం:అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్త గౌ. శ్రీ పెట్లా ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన AP Gen-Z WAR రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు.ఈ దీక్షలో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త గౌ. శ్రీ బొడ్డేడ ప్రసాద్ పాల్గొని నిరుద్యోగ యువత సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం  పేర్కొన్నారు.ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ, డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.డీఎస్సీ–2025లో జరిగిన అవకతవకలు, నిరుద్యోగ యువత సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అమలు తదితర అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మరోసారి కోరుతున్నామని తెలిపారు. యువత ఆశలు, విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.