అనకాపల్లిలో ‘అనకాపల్లి’ బ్లాక్‌బస్టర్ హిట్.. చిత్ర బృందంపై ప్రశంసల వర్షం
🗞️ బిబి న్యూస్ | 08 Aug 2026
అనకాపల్లి చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనకాపల్లి’ చిత్రం అనకాపల్లిలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఫ్రేమ్‌లోనూ చిత్ర బృందం పడిన కష్టం, శ్రమ స్పష్టంగా కనిపిస్తోందని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.చిత్రంలో కాండ్రేగుల నాయుడు,రాజా చేసిన కృషి ప్రత్యేకంగా ఆకట్టుకుందని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నాయుడు బామ్మర్ది పోషించిన పాత్ర ప్రేక్షకులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని, ఎంతో అనుభవం ఉన్న ప్రతినాయకుడిలా అద్భుతంగా నటించారని ప్రశంసిస్తున్నారు.తారక్ పొన్నప్ప ప్రతి ఫ్రేమ్‌లో తన నటనతో అదరగొట్టారని ప్రేక్షకులు పేర్కొంటున్నారు. ఆయన నటనతో పాటు సినిమాలోని పాటలోనూ అద్భుతంగా కనిపించారని, ఆయన పాట ప్రేక్షకులను ఈలలు వేయించి థియేటర్లలో సందడి చేయిస్తోందని చెబుతున్నారు.హీరో విక్రమ్ సహదేవ్, హీరోయిన్ సంధ్య అందమైన జంటగా ఆకట్టుకోవడంతో పాటు నటనలో ఒకరిని మించి ఒకరు రాణించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. వీరిద్దరి జంట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు.ఇంద్రజ తల్లి పాత్రలో తన బిడ్డ కోసం పడే ఆరాటాన్ని ఎంతో సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించారు. అలాగే తండ్రి పాత్రలో త్రినాధరావు గారు బరువైన పాత్రను ఎంతో బాధ్యతగా పోషించారని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన తండ్రి పాత్రలో ఆయన నటన అద్భుతంగా ఉందని, పాత్రలో పూర్తిగా జీవించారని ప్రశంసిస్తున్నారు.సినిమాలోని పాటలు ఎంతో సహజంగా చిత్రీకరించారని ప్రేక్షకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ‘అమ్మోరు దిగినాది’ పాట థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ఈలలు, చప్పట్లతో సందడి చేయిస్తోందని చెబుతున్నారు.‘అమ్మోరు దిగినాది’ పాటకు థియేటర్లలో వస్తున్న స్పందన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాటతో పాటు సంగీతం, నేపథ్య సంగీతం కూడా మరో స్థాయిలో ఉన్నాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.చిత్ర దర్శకుడు కాగేష్ దర్శకత్వ ప్రతిభను ప్రేక్షకులు అభినందిస్తున్నారు. అలాగే ఛాయాగ్రాహకుడు (డీఓపీ)తో పాటు సాంకేతిక నిపుణులు, నటీనటులు పడిన శ్రమ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించిన ‘అనకాపల్లి’ చిన్న సినిమా పెద్ద విజయాన్ని అందుకుని అనకాపల్లిలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.