బీజేపీ అనకాపల్లి జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్‌గా దాడి వీరునాయుడు
🗞️ బిబి న్యూస్ | 08 Aug 2026
అనకాపల్లి: భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్‌గా దాడి వీరునాయుడు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ బాధ్యత అప్పగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా దాడి వీరునాయుడు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు, బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావుకు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.దాడి వీరునాయుడు ఎంపికపై బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక రంగంలో సేవలందిస్తున్న దాడి వీరునాయుడుకు బీజేపీ జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించడం సంతోషకరమైన పరిణామమని అన్నారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆకాంక్షించారు.దాడి వీరునాయుడుకు ఈ బాధ్యతలు దక్కడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు.