📢 Advertisement Space

డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి

🗞️ బిబి న్యూస్ | 10 Aug 2026

కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ
ఎలమంచిలి: డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఎలమంచిలిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.వైఎస్సార్‌సీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ఎలమంచిలి టౌన్ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ఈ నిరసన ర్యాలీ సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియలో అవకతవకలకు బాధ్యత వహించాల్సిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవిలో కొనసాగడం సరికాదని అన్నారు. నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.డీఎస్సీ నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడకూడదని, సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.