80వ వార్డులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కె యం నాయుడు
🗞️ బిబి న్యూస్ | 15 Aug 2026
అనకాపల్లి: 80వ వార్డులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె.ఎం. నాయుడు హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కె.ఎం. నాయుడు మాట్లాడుతూ.. తొండ నారాయణమూర్తి, చదరం పరమేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్యమని, ప్రతి పౌరుడు దేశం పట్ల భక్తి, గౌరవ భావాలను కలిగి ఉండాలని సూచించారు. అనకాపల్లి, 80వ వార్డు ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో 81వ వార్డు ఇన్‌చార్జ్ బొడ్డెడ శివ, వైఎస్సార్‌సీపీ జిల్లా ట్రెజరర్ పెంటకోట శ్రీనివాసరావు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మారిశెట్టి శ్రీను, తొండ నారాయణమూర్తి, వీవీ సంతోష్, చదరం పరమేశ్వరరావు, వాసుపల్లి తాతీలు, కాండ్రేగుల తులసి తదితరులు పాల్గొన్నారు.