📢 Advertisement Space

అనకాపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

🗞️ బిబి న్యూస్ | 15 Aug 2026

అనకాపల్లి: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు హుస్సేన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనిశెట్టి సురేష్ బాబు హాజరయ్యారు. సభకు సపోర్ట్ యు చైర్మన్ కాండ్రేగుల సర్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా రాష్ట్ర అవార్డు గ్రహీత దొడ్డి రమేష్ పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను వివరించారు.ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలపై ప్రసంగించారు. వర్చువల్ మోడ్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ వ్యవస్థాపకుడు, మెమోరియల్ సొసైటీ ప్రతినిధి సందేశాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో కర్రి రాఘవు, విశ్రాంతి ప్రధానాచార్యులు దుడ్డు శ్రీనివాసరావు, కాండ్రేగుల శంకర్, అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపకుడు ఆళ్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ కన్వీనర్ కోనేపల్లి సత్యనారాయణ వందన సమర్పణ చేశారు. అనంతరం జాతీయ గీతం ‘జనగణమన’తో కార్యక్రమం ముగిసింది.