దేశభక్తిని చాటుకున్న బీజేపీ శ్రేణులు..అనకాపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
🗞️ బిబి న్యూస్ | 16 Aug 2026
అనకాపల్లి: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ పతాకానికి గౌరవం తెలిపి దేశభక్తిని చాటుకున్నారు.ఈ సందర్భంగా ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ తదితర మహనీయుల పోరాటం, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.అమరవీరుల త్యాగనిరతిని, ఆదర్శాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలని సూచించారు.అనంతరం నాయకులు, కార్యకర్తలు పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుని మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు, జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ దాడి వీరునాయుడు, ముత్యాల వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు (అప్పికొండ), శ్రీరామమూర్తి, స్వరూప్, ఉమామహేశ్వరరావు, మోహన్‌రావు, పలకా రవి, అప్పలరాజు, సత్యనారాయణ, సన్యాసిరావు, అప్పారావు, మహిళా మోర్చా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.