డాన్సర్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ ఆవిష్కరించిన గవర కార్పోరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర
🗞️ బిబి న్యూస్ | 17 Aug 2026
అనకాపల్లి, ఆగస్టు 17: విశాఖ జిల్లా డాన్సర్స్, డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23, 24, 25 తేదీల్లో అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న డాన్సర్ ప్రీమియర్ లీగ్ (DPL) క్రికెట్ పోటీల పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర తన నివాసంలో డాన్సర్ల సమక్షంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మళ్ళా సురేంద్ర మాట్లాడుతూ అందరి సహకారంతో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా డీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ ఫరీద్, 83వ టీడీపీ ఇంచార్జ్ బొద్దపు ప్రసాద్, పొలిమేర ఆనంద్‌తో పాటు పలువురు డాన్సర్లు పాల్గొన్నారు.