జార్జి క్లబ్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా: జాయింట్ సెక్రటరీ వెదురుపర్తి సుందరయ్య (బాబి
🗞️ బిబి న్యూస్ | 18 Aug 2026
అనకాపల్లి, ఆగస్టు 18: జార్జి క్లబ్ జాయింట్ సెక్రటరీగా వెదురుపర్తి సుందరయ్య (బాబి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీ పదవికి ఆయన పేరును ప్రకటించగానే క్లబ్ పెద్దలు, సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపి ఎంపిక చేశారు.ఈ సందర్భంగా వెదురుపర్తి సుందరయ్య (బాబి) మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కృషి చేసిన క్లబ్ గౌరవ పెద్దలకు, సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తనకు అప్పగించిన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, క్లబ్ అభివృద్ధికి నిరంతరం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.క్లబ్ సభ్యుల మన్ననలు పొందే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు.తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెదురుపర్తి సుందరయ్య (బాబి) అన్నారు.