ఉపాధి హామీ పనులు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసిన అధికారులు
🗞️ బిబి న్యూస్ | 23 Feb 2026
పరవాడ మండలంలో గొర్లవానిపాలెం పంచాయతీ లో ఉపాధి హామీ పనులు నిర్వహణ గత కొన్ని రోజులుగా నిలిపివేశారు. దీంతో ప్రజా సంఘాలు ఉపాధి హామీ కార్మికులతో ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రమేష్ నాయుడుతో సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ చర్చలు నిర్వహించారు. ఈ కేవైసీ, డిమాండ్ రెడీ చేసుకుని బుధవారం నుండి పనులు పనులు పునర ప్రారంభానికిఉపాధి హామీ కార్మికులకు ఎంపీడీవో హామీ ఇచ్చారు.ఈ బోనంగి వి ఆర్ పి కి అదనపు బాధ్యతలు అప్పగించి ఉపాధి హామీ కార్మికులకు పనులు ఇవ్వడానికి ఎంపీడీవో ఉపాధి హామీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉపాధి హామీ కార్మికులు ఆందోళన కార్యక్రమాలను ముగించి ఎంపీడీవో కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికుల నాయకులు పుష్ప, లక్ష్మి, రవణమ్మ, అప్పల నరసింహ, ఉమా, వరలక్ష్మి, వెంకటి, తదితరులు పాల్గొన్నారు.