అనకాపల్లి: భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ దాడి వీరనాయుడు జన్మదిన వేడుకలు గురువారం అనకాపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి దాడి వీరనాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు విల్లూరి బుల్లి అప్పలనాయుడు, అటల్జీ, మండల అధ్యక్షులు కొమ్మనాపల్లి సన్యాసిరావు, నానాజీ, శేషు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు దాడి వీరనాయుడిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.