వాడ్రాపల్లిలో ఘనంగా సుందరపు విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు
🗞️ బిబి న్యూస్ | 20 Aug 2026
మునగపాక: ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జన్మదిన వేడుకలను మల్ల రాజేష్ ఆర్థిక సహాయంతో మల్ల రాజేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేద ప్రజలకు బియ్యం, పాలు, గర్భిణీ స్త్రీలకు బియ్యం, పాలు, గుడ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొయిలాడ దశావతారం, తురాయి మోహన్, సూరిశెట్టి శివాజీ, మల్ల తులసి, టీడీపీ నాయకులు కాండ్రేగుల నూక అప్పారావు, గుబ్బల సత్యనారాయణ, సూరిశెట్టి రాము, డి. గణేష్, ఉత్సవ కమిటీ చైర్మన్ మల్ల సంజీవరావు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.