📢 Advertisement Space

శ్రావణ మాసం రెండవ శుక్రవారం నూకాంబిక అమ్మవారికి వైభవంగా ధనలక్ష్మి అలంకరణ

🗞️ బిబి న్యూస్ | 21 Aug 2026

అనకాపల్లి, ఆగస్టు 21: శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి వైభవంగా ధనలక్ష్మి అలంకరణ నిర్వహించారు. సుమారు రూ.10 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని అత్యంత వైభవంగా అలంకరించారు.ధనలక్ష్మి స్వరూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారి ఆశీస్సులు లభించాలని దేవస్థానం తరఫున ఆకాంక్షించారు.ఈ అలంకరణ కార్యక్రమానికి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం శ్రీహరి భజన మండలి (కోలాటం టీం)కు చెందిన బొగ్గారపు సీత, బొగ్గారపు విశాలాక్షి బృందం సహాయ సహకారాలు అందించారు. వారి సేవలను దేవస్థానం పాలకవర్గ సభ్యులు, అధికారులు అభినందించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు), ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.