10 ఏళ్లకే రచయితగా ప్రతిభ చాటిన తేజవీర్ నాయుడు మలసాల
🗞️ బిబి న్యూస్ | 24 Aug 2026
హైదరాబాద్: చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను కనబరుస్తూ తేజవీర్ నాయుడు మెహర్ మలసాల అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. మలసాల భరత్ కుమార్ కుమారుడైన తేజవీర్ నాయుడు 10 సంవత్సరాల వయసులోనే “Vortex of Time” అనే పుస్తకాన్ని రచించి, 11 ఏళ్లకే రచయితగా గుర్తింపు పొందడం విశేషం.టైమ్ మెషిన్ ద్వారా గతంలోకి ప్రయాణించే Time Travel నేపథ్యంలో “Vortex of Time” పుస్తకాన్ని తేజవీర్ ఎంతో ఆసక్తికరంగా రచించాడు. ఒక తండ్రి టైమ్ ట్రావెల్ చేసి తన కుమార్తెను ఎలా కాపాడుకున్నాడనే ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ పుస్తకాన్ని రూపొందించాడు.చిన్నతనం నుంచే తేజవీర్‌లో అసాధారణ ప్రతిభ కనిపించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కేవలం 7 నెలల వయసులోనే ఫ్లాష్ కార్డులను గుర్తుపట్టే అద్భుత జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు. ఇప్పటివరకు 300కు పైగా పుస్తకాలను చదివి పుస్తకాలపై తనకున్న ఆసక్తిని చాటుకున్నాడు.ప్రస్తుతం హైదరాబాద్ బాచుపల్లిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న తేజవీర్ నాయుడు, ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ (IMO) పరీక్షల్లో తరచూ టాప్-10 ర్యాంకుల్లో నిలుస్తున్నాడు. అలాగే చెస్‌లోనూ తన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు.భవిష్యత్తులో పుస్తక రచయితగా కొనసాగడంతో పాటు రోబోటిక్స్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేయాలన్నది తేజవీర్ నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. తండ్రి మలసాల భరత్ కుమార్ ప్రోత్సాహంతో తేజవీర్ ఇప్పటికే తన ప్రతిభను వివిధ రంగాల్లో చాటుకుంటున్నాడు.చిన్న వయసులోనే సాహిత్యం, గణితం, చెస్ వంటి విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న తేజవీర్ నాయుడు భవిష్యత్తులో రోబోటిక్స్‌తో పాటు సాహిత్య రంగంలోనూ మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.