📢 Advertisement Space

శతకంపట్టులో ఘనంగా శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఉత్సవాలు

🗞️ బిబి న్యూస్ | 25 Aug 2026

అనకాపల్లి, గవరపాలెం:శతకంపట్టు వద్ద వెలసిన శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఉత్సవాలను ఈ ఏడాది వీధి పెద్దల సహకారంతో మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు కె.ఎం. నాయుడు తెలిపారు. ఉత్సవాల నిర్వహణతో పాటు ఆలయ అభివృద్ధికి మూలనిధులు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.ఆలయ గౌరవ అధ్యక్షులు కొణతాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతన కార్యదర్శులుగా గండేపల్లి మురళీకృష్ణ, పెంటకోట లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా బుద్ధ సంతోష్, దాడి కిరణ్, మళ్ల రాజు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గతంలో కార్యదర్శిగా సేవలందించిన స్వర్గీయ పొలిమేర శ్రీను సేవలను వక్తలు కొనియాడారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ గౌరీపరమేశ్వరి కమిటీ అధ్యక్షులు కొణతాల సంతోష్ అప్పారావు నాయుడు, శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం శాశ్వత చైర్మన్ కాండ్రేగుల నాయుడు, మద్దాల శంకర్రావు ఉత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ వ్యవస్థాపకులు పి.వి. రమణ, దాడి కృష్ణ, సూరిశెట్టి నరసింగరావు, కొణతాల నూక మహాలక్ష్మినాయుడు ఉత్సవ కరపత్రికను ఆవిష్కరించారు.ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 26వ తేదీ రాత్రి ఆలయం వద్ద దొడ్డి మల్లయ్య, దొడ్డి మల్లయ్యల పర్యవేక్షణలో పుట్టుక–కథా కాలక్షేపం నిర్వహించనున్నారు. ఆగస్టు 27వ తేదీ సాయంత్రం మద్దాల చిరంజీవి, శరగడం పరుశురాం బహూకరించిన 54 ఇత్తడి ఘటాలతో పాటు, శ్రీ గౌరీపరమేశ్వరి, శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీల ఆధ్వర్యంలో చిన్నారి దేవతల వేషాల బండ్లు, శ్రీ మరిడిమాంబ కమిటీ ఆధ్వర్యంలో చిటికెల భజన, కోలాటం, ఎంకే డీజే తదితర జానపద కళారూపాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించనున్నారు.అదే రాత్రి భీశెట్టి అప్పారావు కళ్యాణ మండపం వద్ద ‘డాన్స్ బేబీ డాన్స్’, శతకంపట్టు వద్ద శ్రీమతి మళ్ల సత్యవతి స్మృత్యర్థం మధురం ఆర్కెస్ట్రా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.అనంతరం బుద్ధ బూలోకనాయుడు వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో వీధి పెద్దలు పొలిమేర సూర్యారావు, పి.వి. సత్యనారాయణ, కొణతాల కృష్ణంరాజు, పెంటకోట సన్యాసినాయుడు, కొణతాల గంగాధర్, ఆలయ కోశాధికారి ఆళ్ల మధు, సంయుక్త కార్యదర్శులు దాడి అప్పలనాయుడు, దొడ్డి జీవన్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.