ప్రజా ఫిర్యాదుల వేదికలో 60 ఫిర్యాదులు స్వీకరణ సత్వర పరిష్కారానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు
🗞️ బిబి న్యూస్ | 23 Feb 2026
అనకాపల్లి, ఫిబ్రవరి 23: అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) తుహిన్ సిన్హా, ఐపీఎస్ మొత్తం 60 ఫిర్యాదులను స్వీకరించారు.స్వీకరించిన ఫిర్యాదుల విభాగాల వివరాలు:భూ తగాదాలు: 30కుటుంబ కలహాలు: 5ఇతర విభాగాలు: 25ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ, “ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించాలి. 7 రోజుల్లోపు విచారణ పూర్తి చేసి,తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చేపట్టిన చర్యల నివేదికలు జిల్లా పోలీసు కార్యాలయానికి తప్పనిసరిగా సమర్పించాలి,” అని స్పష్టం చేశారు.ఫిర్యాదిదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ , “ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత. అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నారు,” అని తెలిపారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్. మోహన్ రావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.