శ్రీ మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న మళ్ళ సురేంద్ర, బొద్ధపు ప్రసాద్ దంపతులు
🗞️ బిబి న్యూస్ | 27 Aug 2026
అనకాపల్లి: పట్టణంలోని కోట్నీ వీధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ మరిడిమాంబ అమ్మవారి మహోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, 83వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జ్ బొద్ధపు ప్రసాద్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారి తీర్థప్రసాదంతో పాటు చిత్రపటాన్ని వారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో కోట్నీ రామకృష్ణ, తలారి ప్రసాద్, షేక్ రియాజ్, కర్రి సుబ్రహ్మణ్యం, దీనబంధు, ఎస్. భానుచందర్ (అఖి), తేజ తదితరులు పాల్గొన్నారు.