అనకాపల్లిలో ఉత్తరాంధ్ర ట్రాక్ సింగింగ్ పోటీలు ప్రారంభంలో మళ్ళ సురేంద్ర
🗞️ బిబి న్యూస్ | 29 Aug 2026
అనకాపల్లి: గవరపాలెం శ్రీ శ్రీ శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ట్రాక్ సింగింగ్ తెలుగు సినిమా పాటల పోటీలను జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభించారు. ముందుగా ముఖ్య అతిథులు అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమానికి ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, జిల్లా దేవాదాయశాఖ అధికారి సుజాత, జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, 80వ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్ బొడ్డేడ జోగి నాయుడు, నంది అవార్డు, జాతీయ పురస్కార గ్రహీత బాల సౌజన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.పోటీల్లో తానవరం ఎస్. ప్రియగీత, వైజాగ్ విజయచంద్రు, అగనంపూడి చాణక్య సూర్యకుమార్, వేములవాడ నాగమణి, దువ్వాడ కే. సత్యారావుతో పాటు 40 మందికి పైగా గాయకులు పాల్గొన్నారు. దేవస్థానం చైర్మన్ మారిశెట్టి భాస్కరరావు, మాజీ చైర్మన్ దాడి వాసు, శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం చైర్మన్ దాడి బుజ్జీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు హాజరయ్యారు.