📢 Advertisement Space

పాయకరావుపేటలో సీఎం కార్యక్రమంపై సమీక్షలో పాల్గొన్న మళ్ళ సురేంద్ర

🗞️ బిబి న్యూస్ | 30 Aug 2026

అనకాపల్లి జిల్లా: సెప్టెంబర్ 2న పాయకరావుపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లపై నేడు సమీక్ష నిర్వహించారు.ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సింహ, అధికారులు, కూటమి పార్టీ నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.సీఎం పర్యటనకు సంబంధించి భద్రత, ఇతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.