📢 Advertisement Space

డాక్టర్‌ సి.ఎం. రమేష్‌ కృషితో రెండేళ్లలో జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక కరపత్రాల ఆవిష్కరణ

🗞️ బిబి న్యూస్ | 31 Aug 2026

అనకాపల్లి: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యులు డాక్టర్‌ సి.ఎం. రమేష్‌ కృషితో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. సోమవారం అనకాపల్లి జాతీయ రహదారిపై అటల్‌ బిహారీ వాజ్‌పేయి విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఎంపీ డాక్టర్‌ సి.ఎం. రమేష్‌ ఆధ్వర్యంలో, ఆయన కృషితో జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రత్యేక కరపత్రాలను బీజేపీ నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా భారీ పెట్టుబడులను తీసుకురావడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, రైల్వే, విద్య, తాగునీరు, సంక్షేమ కార్యక్రమాల కోసం ఎంపీ డాక్టర్‌ సి.ఎం. రమేష్‌ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు.గత రెండేళ్లలో జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సాధించిన ప్రాజెక్టులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను ప్రతి కుటుంబానికి వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి, ఎంపీ డాక్టర్‌ సి.ఎం. రమేష్‌ కృషితో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ప్రజలకు వాస్తవాలను చేరవేసే బాధ్యతను కూటమి నాయకులు, ప్రతి బీజేపీ కార్యకర్త తీసుకుంటారని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రొంగలి గోపి శ్రీనివాస్‌, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బీజేపీ ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు, జిల్లా ధార్మిక సెల్‌ కన్వీనర్‌ దాడి వీరునాయుడు, 84వ వార్డు ఇన్‌చార్జి గేదెల స్వరూప్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేవైఎం నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.