📢 Advertisement Space

ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయులకు అండగా కాండ్రేగుల చందు

🗞️ బిబి న్యూస్ | 01 Sep 2026

కశింకోట: ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాండ్రేగుల చందు ఆవేదన వ్యక్తం చేశారు.జీతాలు లేక ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఆర్‌ఈసీఎస్ ఆధ్వర్యంలో ఉన్న సమయంలో జీతాలు ఎప్పటికప్పుడు చెల్లించేవారని, ఏపీ ఈపీడీసీఎల్ వచ్చిన తర్వాత జీతాలు పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపించారు. సంస్థ లాభాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల జీతాలను నిలిపివేయడం తగదన్నారు. తక్షణమే పెండింగ్ జీతాలను వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉపాధ్యాయులకు బీసీ సంక్షేమ సంఘం అండగా నిలిచి, అవసరమైతే పోరాటాలకు సిద్ధమవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.