నర్సీపట్నం చేరిన ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకంబిక అమ్మవారి శోభాయాత్ర
🗞️ బిబి న్యూస్ | 24 Feb 2026
అనకాపల్లి జిల్లా, గవరపాలెంలోని శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానం నుండి బయలుదేరిన ఇలవేల్పు శోభాయాత్ర సోమవారం చోడవరం గ్రామం నుండి ప్రారంభమై, పడ్డవడ్డాది, రావికవిటం మార్గాల దాటి రాత్రి నర్సీపట్నం చేరుకుంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన ఈ ఇలవేల్పు, మాజీ మంత్రి, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆదేశాల ప్రకారం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత, నర్సీపట్నం పట్టణంలో శోభాయాత్ర కొనసాగుతుందని దేవస్థానం చైర్మన్ పి. నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహాయ కమిషనర్ యాళ్ళ శ్రీధర్ తెలిపారు.