అనకాపల్లి: బీసీ యువతకు రానున్న రోజుల్లో మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాండ్రేగుల చందు అన్నారు. యువత విద్య, నైపుణ్యాలను పెంపొందించుకుని పోటీ పరీక్షలు, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీ యువతకు ఉద్యోగ మార్గదర్శకత్వం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. “యువత బలపడితేనే బీసీ సమాజం అభివృద్ధి చెందుతుంది” అని చందు పేర్కొన్నారు.