అనకాపల్లిలో కన్నుల పండుగగా మళ్ళ స్రవంతి ఓణీ వేడుక...కూటమి నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర–జిల్లా అధ్యక్షుల సందడి
🗞️ బిబి న్యూస్ | 02 Sep 2026
ముఖ్యమంత్రి కార్యక్రమం ఉన్నప్పటికీ మళ్ళ సురేంద్ర ఆహ్వానానికి విశేష స్పందన
అనకాపల్లి: రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర తమ్ముడు మళ్ళ రాంబుజ్జి కుమార్తె మళ్ళ స్రవంతి ఓణీ వేడుక అనకాపల్లి రింగ్ రోడ్డులోని పెంటకోట కన్వెన్షన్ హాల్‌లో బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. అనకాపల్లి నగరంలో ఇంతకుముందెన్నడూ లేని రీతిలో రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది.ఈ వేడుకకు కూటమి ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరై మళ్ళ స్రవంతిని ఆశీర్వదించారు. ప్రముఖుల రాకతో పెంటకోట కన్వెన్షన్ హాల్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
సీఎం కార్యక్రమం ఉన్నా... సురేంద్ర ఆహ్వానానికి విశేష స్పందన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే సమయంలో అనకాపల్లి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ, మళ్ళ సురేంద్ర ఆహ్వానాన్ని గౌరవించి పలువురు ప్రముఖులు తమ సమయాన్ని కేటాయించుకుని ఓణీ వేడుకకు హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజకీయంగా కీలకమైన కార్యక్రమాలను పక్కనపెట్టి సైతం ప్రముఖులు ఈ వేడుకకు తరలిరావడం మళ్ళ సురేంద్రకు రాజకీయ వర్గాల్లో ఉన్న ఆదరణ, గౌరవానికి నిదర్శనంగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఒకే వేదికపై కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర–జిల్లా స్థాయి నాయకులు, సినీ ప్రముఖులు సందడి చేయడంతో అనకాపల్లి నగరంలో ఈ వేడుక హాట్‌టాపిక్‌గా మారింది. స్రవంతిని ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రముఖులతో కన్వెన్షన్ హాల్ కళకళలాడింది.“సమయం కేటాయించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు”ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చిన ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పటికీ, తమ విలువైన సమయాన్ని కేటాయించుకుని స్రవంతి ఓణీ వేడుకకు హాజరై ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు” తెలిపారు.తన కుటుంబ శుభకార్యానికి విచ్చేసి స్రవంతిని ఆశీర్వదించిన రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ మళ్ళ సురేంద్ర కృతజ్ఞతలు తెలిపారు.అనకాపల్లి చరిత్రలోనే ఒక ప్రతిష్టాత్మక కుటుంబ వేడుకగా నిలిచిన మళ్ళ స్రవంతి ఓణీ వేడుక, మళ్ళ సురేంద్రకు రాజకీయ, సామాజిక వర్గాల్లో ఉన్న ప్రత్యేక గౌరవాన్ని మరోసారి చాటిచెప్పిందనే చర్చ అనకాపల్లిలో జోరుగా సాగింది.