బీసీ మహిళా మంత్రి కొండా సురేఖపై చర్యలు సిగ్గుచేటు:కాండ్రేగుల చందు
🗞️ బిబి న్యూస్ | 03 Sep 2026
అనకాపల్లి: తెలంగాణకు చెందిన బీసీ మహిళా మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాండ్రేగుల చందు తీవ్రంగా ఖండించారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సురేఖ, ఆమె భర్త మురళీ బీసీలలో దమ్మున్న నాయకులుగా గుర్తింపు పొందారని అన్నారు.ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు సీఎం, కాంగ్రెస్ పార్టీపై ఎన్ని ఆరోపణలు చేసినా చర్యలు తీసుకోలేదని, బీసీ వర్గానికి చెందిన మహిళా నాయకురాలైన సురేఖపై మాత్రమే చర్యలు తీసుకోవడం అన్యాయమని విమర్శించారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చందు తెలిపారు.