📢 Advertisement Space

నేడు కొండ కొప్పాక లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

🗞️ బిబి న్యూస్ | 04 Sep 2026

అనకాపల్లి జిల్లా, కొండకొప్పాక: గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో సెప్టెంబర్ 4న శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా కోలాటాలు, తప్పెటగుళ్లు, ఉట్టి ఉత్సవం, నాటకాలు, సంగీతం, నృత్య ప్రదర్శనలు తదితర ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు.డాడి వీరునాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి భక్తులు, గ్రామ ప్రజలు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.