పెద్దనాపల్లిలో బుద్ధ నాయుడు మెమోరియల్ కళ్యాణ మండపం, విగ్రహావిష్కరణ
🗞️ బిబి న్యూస్ | 04 Sep 2026
ఏలేశ్వరం: కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో కీర్తిశేషులు శ్రీ బుద్ధ బాబురావు (నాయుడు) జ్ఞాపకార్థం ఆయన కుమారులు బుద్ధ ఈశ్వరరావు, బుద్ధ సూర్యప్రకాష్ నిర్మించిన బుద్ధ నాయుడు మెమోరియల్ కళ్యాణ మండపం, విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్లు వేగి పరమేశ్వరరావు, బొడ్డెడ శ్రీను పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ బుద్ధ బాబురావు నాయుడు ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలందించారని, ఆయన వారసులు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కళ్యాణ మండపాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. అన్ని కులాల ప్రజలు వినియోగించుకునేలా కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమని పేర్కొన్నారు.కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన గౌరీ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.