సమస్యల వినతులు స్వీకరించిన జనసేన పార్టీ ఇన్చార్జ్ భీమరశెట్టి రాంకీ
🗞️ బిబి న్యూస్ | 24 Feb 2026
అనకాపల్లి: స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు, కూటమి కార్యకర్తల నుండి వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించారు.సమస్యలను శ్రద్ధగా విన్న అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బీమరశెట్టి రాంకీ వారి సమస్యలపై సానుకూలంగా స్పందించారు.ఈ వినతులను మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లి, అతి త్వరలో పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా, ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని ఆయన తెలియజేశారు.