నర్సీపట్నంలో రేపు ‘జయహో బీసీ’ సభ విజయవంతం చేయండి.మళ్ళ సురేంద్ర
🗞️ బిబి న్యూస్ | 08 Sep 2026
అనకాపల్లి: నర్సీపట్నంలో సెప్టెంబర్ 9న సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఏపీ బీసీ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర తెలిపారు. అనకాపల్లి గవరపాలెంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.బీసీ రిజర్వేషన్లను 24 శాతం నుంచి 34 శాతానికి పెంచిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల నాయకులు భారీగా హాజరై సభను విజయవంతం చేయాలని మళ్ళా సురేంద్ర పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొణతాల రత్నకుమారి, టీడీపీ ఇంచార్జ్‌లు బోడెడ జోగి నాయుడు, పోలవరపు త్రినాథ్, ఏపీ గవర కార్పొరేషన్ డైరెక్టర్ బోడెడ శ్రీనివాసరావు, దాడి జగన్, పెదపాటి కళ్యాణి, బత్తుల లక్ష్మి, పిట్ల రాజు, పైలా గోపి, మళ్ళా సూరిబాబు, నంద్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.