📢 Advertisement Space

కర్నూలు పోలీసుల చర్యలపై న్యాయవాదుల నిరసన

🗞️ బిబి న్యూస్ | 24 Feb 2026

అనకాపల్లి, ఫిబ్రవరి 24: కర్నూలు కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది పవన్ కుమార్‌పై కర్నూలు సిటీ పోలీసుల సీఐ విక్రమ్ సింహ అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానకరంగా ప్రవర్తించారు. ఈ సంఘటనకు నిరసనగా అనకాపల్లి న్యాయవాదులు కోర్టు విధులకు హాజరు కాకుండా బాయ్‌కాట్ నిర్వహించారు.న్యాయవాదుల గౌరవాన్ని కాపాడుకోవాలని, పోలీసుల చర్యలను ఖండించాలని ఈ విన్నపం ద్వారా పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్ల హర శ్రీనివాసరావు,వైస్ ప్రెసిడెంట్ సుంకర శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శి బంధం వెంకటరమణ మరియు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.