📢 Advertisement Space

అనకాపల్లి జనసేన కార్యాలయంలో ప్రజా సమస్యలపై వినతుల స్వీకరణ

🗞️ బిబి న్యూస్ | 16 Sep 2026

అనకాపల్లి: అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు, కూటమి కార్యకర్తల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్‌కీ స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, భీమరశెట్టి రామ్‌కీ సమస్యలను సావధానంగా విని సానుకూలంగా స్పందించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు, కార్యకర్తలకు అండగా నిలుస్తుందని భీమరశెట్టి రామ్‌కీ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు, కార్యకర్తలకు భరోసా కల్పించారు.