📢 Advertisement Space

సబ్‌జైలును పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి

🗞️ బిబి న్యూస్ | 16 Sep 2026

అనకాపల్లి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ డివిజన్‌ సివిల్‌ జడ్జి ఆర్‌. సన్యాసి నాయుడు బుధవారం అనకాపల్లి సబ్‌జైలును పరిశీలించారు. ఈ సందర్భంగా జైలులోని నిందితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.బెయిల్‌ పొందేందుకు ఆర్థిక స్థోమత లేని నిందితులు ఉచిత న్యాయ సహాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం సత్ప్రవర్తనతో మెలగాలని తెలిపారు.అనంతరం ఖైదీల ఆరోగ్య పరిస్థితి, వారికి అందిస్తున్న ఆహారం, ఆహార మెనూ తదితర వివరాలను జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌, న్యాయ సహాయకులు సాయిరాం, శరత్‌, రామ్‌, మోహన్‌కాంత్‌, ఎంఎల్‌ఎస్‌సీ ప్రతినిధి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.