ఆశీర్వాద దీపాలతో వెలిగిన అనకాపల్లి
🗞️ బిబి న్యూస్ | 17 Sep 2026
మోదీ జన్మదినం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో బీజేపీ–కూటమి నేతల ప్రత్యేక కార్యక్రమం
అనకాపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో దేశానికి మరింతకాలం సేవలందించాలని ఆకాంక్షిస్తూ అనకాపల్లిలో ‘ప్రతి ఇంటా ఒక ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం సాయంత్రం ఆరు గంటలకు అనకాపల్లి నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపు మేరకు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదేశాలు, మార్గదర్శకత్వంలో జిల్లాలో ‘ప్రతి ఇంటా ఒక ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల ఆశీస్సులు, దైవానుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ దీపాలను వెలిగించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపు, రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లాలో ఆశీర్వాద దీపాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటా దీపం వెలిగించి ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ప్రజలను కోరారు.బీజేపీ జిల్లా ధార్మిక సెల్ అధ్యక్షుడు దాడి వీరునాయుడు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో దేశానికి మరింతకాలం సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాద దీపాలను వెలిగించినట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, దైవానుగ్రహం ప్రధాని మోదీకి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు మాట్లాడుతూ, ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఆశీర్వాద దీపాల కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు భాగస్వాములు కావడం సంతోషకరమన్నారు.మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ, దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని గుర్తు చేసుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని సంవత్సరాలు దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు.బీజేపీ జిల్లా ఇన్‌చార్జి భానుమతి మాట్లాడుతూ, ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.బీజేపీ జిల్లా కార్యదర్శి బొడ్డే నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆశీర్వాద దీపాల కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారని తెలిపారు.
వాజ్‌పేయి విగ్రహం వద్ద దీపారాధన
అనంతరం అనకాపల్లి బైపాస్ వద్ద ఉన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలు దీపాలు వెలిగించారు. అనంతరం ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కర్రి రామకృష్ణ ,మునగపాక మండల బీజేపీ అధ్యక్షుడు మళ్ల కాలేష్,కాండ్రేగుల శ్రీనుతో పాటు బీజేపీ, టీడీపీ, జనసేనకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.అనకాపల్లిలో వెలిగిన ఆశీర్వాద దీపాలు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రజల ఆకాంక్షలు, ఆశీస్సులు, ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచాయి.