మోటర్ దొంగలను అరెస్ట్ చేసిన కశింకోట పోలీసులు.... 8 మోటార్లు,బైక్,మొబైల్స్ రికవరీ!
🗞️ బిబి న్యూస్ | 16 Feb 2026
కశింకోట, బిబి న్యూస్ ,జనవరి 30: కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసపడి జరుగుతున్న మోటార్ దొంగతనాల కేసులను సీఐ ఏ. స్వామి నాయుడు మార్గదర్శకత్వంలో పోలీసులు విజయవంతంగా ఛేదించారు.అనంతరం స్వామి నాయుడు మాట్లాడుతూ ఎస్‌ఐలు పి. మనోజ్ కుమార్, లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గోకివానిపాలెం గ్రామ శివారుల్లో వాహన తనిఖీలు చేపట్టగా ముగ్గురు నిందితులు పట్టుబడ్డారని,కేసు వివరాలు ప్రకారం కిల్లాడ గంగ రమణ (26, మల్లం గ్రామం), కర్రి సాయి కుమార్ (21, ఉప్పరపల్లి గ్రామం), వైబోయిన జానకి రామ్ (22, మల్లం గ్రామం),వీరు విచారణలో కశింకోట మండలంలోని గోకివానిపాలెం, ఏ యస్ పేట, అడ్డం, మోసయ్యపేట, అచ్చెర్ల గ్రామాల పొలాల్లో మోటార్లు దొంగిలించినట్లు ఒప్పుకోగా వారి సమాచారంతో బుచ్చయ్యపేట మండలం మల్లం గ్రామం వద్ద 8 మోటార్లు, ఒక హోండా యూనికాన్ బైక్, మూడు మొబైల్ ఫోన్లు రికవరీ చేశారని కానిస్టేబుల్లు డి. గోపీ, శ్రీనివాస్, మహేష్, లక్ష్మణ్, రాజశేఖర్, కె.ఎన్. మూర్తి కీలక పాత్ర పోషించారని అన్నారు.ఈ కేసుల పరిష్కారంతో రైతులు కశింకోట పోలీసులపై ఆనందం, కృతజ్ఞతలు తెలిపారు.నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సి ఐ స్వామి నాయుడు అన్నారు.