అనకాపల్లి జిల్లా ఏ.ఆర్.బలగాల వార్షిక డీ-మొబిలైజేషన్ ముగింపు: పోలీసుల నైపుణ్యమే సమాజ రక్షణకు ప్రాధాన్యత - జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్
🗞️ బిబి న్యూస్ | 24 Feb 2026
అనకాపల్లి,ఫిబ్రవరి 24: అనకాపల్లి జిల్లా సాయుధ రిజర్వ్ (DAR) పోలీస్ సిబ్బందికి గత 15 రోజులుగా నిర్వహించిన వార్షిక డీ-మొబిలైజేషన్ కార్యక్రమం మంగళవారం విజయవంతంగా ముగిసింది. విశాఖపట్నం కైలాసగిరి పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ముగింపు వేడుకకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై, సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణారావు నేతృత్వంలో జరిగిన పోలీసు బలగాల కవాతును ఎస్పీ వీక్షించి,వారి క్రమశిక్షణను అభినందించారు.ఎస్పీ సూచనలుఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ,మారుతున్న సాంకేతికత మరియు సోషల్ మీడియా ప్రభావం దృష్ట్యా పోలీసులు తమ పనితీరులో నూతన దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.పోలీస్ అంటే భయం కాదు, భరోసా అనే భావన ప్రజల్లో కల్పించాలని, ప్రతి చర్యలో పారదర్శకత, మానవత్వం ఉండాలని సూచించారు.అక్రమ సమావేశాలు,అనుమతి లేని ర్యాలీలను నియంత్రించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉంటూ,చట్టపరమైన నిబంధనల ప్రకారం శాంతియుతంగా సమస్యలను పరిష్కరించాలని కోరారు.శిక్షణ వివరాలుఫిబ్రవరి 4 నుండి 18 వరకు జరిగిన ఈ 15 రోజుల శిక్షణా కార్యక్రమంలో సుమారు 240 మంది ఏ.ఆర్. సిబ్బందికి ఆయుధాల వినియోగం, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, మాబ్ కంట్రోల్ వంటి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందించారు.ఆయుధాల వినియోగంలో AK-47, SLR, ఇన్సాస్, కార్బైన్, పిస్తల్, MP-5, UBGL లాంచర్ల హ్యాండ్లింగ్, ఫైరింగ్ ప్రాక్టీస్; ఫిజికల్ ట్రైనింగ్,యోగా,ఆర్మ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్ బాంబ్ డిస్పోజల్,వి.ఐ.పి సెక్యూరిటీ, వజ్ర వాహన వినియోగం; APCS & CCA చట్టాలు, క్రమశిక్షణ, ఆరోగ్యం,ఆర్థిక క్రమశిక్షణపై ఉపన్యాసాలు నిర్వహించారు.ఈ నైపుణ్యాలు విధి నిర్వహణలో వెన్నెముకలా నిలుస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.సిబ్బంది సంక్షేమంపోలీసు విధులతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ బాధ్యతల పట్ల శ్రద్ధ పెట్టాలని ఎస్పీ హితవు పలికారు.ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్,ఎల్.మోహన రావు, ఎస్.బి.డీఎస్పీ జీ.ఆర్.ఆర్.మోహన్,ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులు,రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మధరావు,రమణమూర్తి, సంజీవరావు,ఆర్ఎస్సై ఆదినారాయణ తదితరులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.