📢 Advertisement Space

రైతు సమస్యల పరిష్కారానికి బుద్ధ మహాలక్ష్మి నాయుడు కృషి

🗞️ బిబి న్యూస్ | 18 Sep 2026

అనకాపల్లి: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించిన నేపథ్యంలో రైతుల సాగునీటి అవసరాలపై నీటి సంఘాల నాయకుడు, రైతు నాయకుడు బుద్ధ మహాలక్ష్మి నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు.ముఖ్యమంత్రి జలహారతి కార్యక్రమం అనంతరం కశింకోట మండలం తాళ్లపాలెం, అనకాపల్లి శారదా నది పరిసర ప్రాంతాల్లో ఇరిగేషన్‌ అధికారులతో కలిసి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి వారి సాగునీటి సమస్యలను తెలుసుకున్నారు.పోలవరం ఎడమ కాలువ నీటిని తాళ్లపాలెం ఏలేరు కాలువతో అనుసంధానం చేయడంతో పాటు, అనకాపల్లి టైప్‌-2 ఎల్లయ్య కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లినట్లు తెలిపారు.రైతుల వాస్తవ సమస్యలను క్షేత్రస్థాయి నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో బుద్ధ మహాలక్ష్మి నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని కాండ్రేగుల సర్వేశ్వరరావు, విశ్రాంతి అధ్యాపకులు, SUPPORT-U రిజిస్టర్డ్ ఎన్‌జీవో (సామాజిక సేవా సంస్థ) ప్రతినిధి, పేర్కొన్నారు.రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న బుద్ధ మహాలక్ష్మి నాయుడిని తమ అనుబంధ సంస్థ Farmers Welfare Association చైర్మన్‌-కమ్‌-చీఫ్‌ అడ్వైజర్‌గా ఏకగ్రీవంగా నియమించినట్లు సర్వేశ్వరరావు తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులను గుర్తించి ప్రోత్సహించడం తమ సంస్థ ఆశయాల్లో భాగమని పేర్కొన్నారు.రైతు సంఘాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో చొరవ చూపాలని ఆయన సూచించారు.సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.రైతుల సంక్షేమం కోసం బుద్ధ మహాలక్ష్మి నాయుడు చేస్తున్న కృషికి ప్రజలు, రైతుల నుంచి మరింత మద్దతు లభించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.