చోడవరం ఎమ్మెల్యే, కూటమి నేతలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ హెచ్చరిక
🗞️ బిబి న్యూస్ | 20 Sep 2026
మునగపాక:చోడవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి,చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్‌పై కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై రాజకీయంగా విమర్శలు చేయడం సహజమేనని, అయితే వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గుడివాడ అమర్నాథ్‌పై కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు కూటమి నేతలు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేయకుండా సంయమనం పాటించాలని బొడ్డేడ ప్రసాద్ హెచ్చరించారు. నాయకుల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే వైఎస్సార్సీపీ శ్రేణులు తగిన విధంగా స్పందిస్తాయని ఆయన పేర్కొన్నారు.