కూటమి విజయంతో పాటు ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు
అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో గణపతికి బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మంచి విజయాన్ని సాధించాలని, ప్రజల ఆశీస్సులు కూటమికి లభించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గణపతిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ధార్మిక సెల్ అధ్యక్షుడు దాడి వీరునాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావుతో పాటు బీజేపీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.