జ్యోతిబాపూలే స్కూల్‌లో 10వ తరగతి ఫేర్‌వెల్ ముఖ్య అతిథిగా గవర కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర
🗞️ బిబి న్యూస్ | 24 Feb 2026
అనకాపల్లి పట్టణం గవరపాలెం నూకాంబిక ఆలయం వద్ద మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్‌లో 10వ తరగతి ఫేర్‌వెల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జ్యోతిబా పూలే చిత్రపటానికి దీపం వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన సురేంద్ర, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి జరుగుతుందని, మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షల్లో అందరూ మంచి మార్కులతో స్కూళ్లకు పేరు తెచ్చుకోవాలని విద్యార్థులను ఉత్తేజపరిచారు.జోనల్ కమిషనర్ చక్రవర్తి, ట్రాఫిక్ సీఐ వెంకటరమణ డ్రగ్స్, అక్సిడెంట్స్ నియంత్రణపై మోటివేషన్ సందేశాలు ఇచ్చారు. స్కూల్ ప్రిన్సిపల్ ఉషా, కమిటీ చైర్మన్ నాయుడు, వైస్ చైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.