మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు: కే.ఎం. నాయుడు
🗞️ బిబి న్యూస్ | 22 Sep 2026
అనకాపల్లి: మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై వ్యక్తిగతంగా, అనుచితంగా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య రాజకీయ సంస్కృతికి మంచిది కాదని 80వ వార్డు ఇంచార్జ్, మాజీ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ కే.ఎం. నాయుడు అన్నారు.అమర్‌నాథ్ చేసిన విమర్శలకు రాజకీయపరంగా, వాస్తవ ఆధారాలతో సమాధానం ఇవ్వాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని పేర్కొన్నారు. పంచదార్ల ప్రాంతంలోని మైనింగ్, అభివృద్ధి తదితర అంశాలపై అమర్‌నాథ్ లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత వాస్తవాలతో సమాధానం ఇవ్వాలని సూచించారు.అదేవిధంగా అమర్‌నాథ్‌పై కోట్ని బాలాజీ చేసిన వ్యాఖ్యలను కూడా కే.ఎం. నాయుడు ఖండించారు. రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపై ఉందన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలని, ఆరోపణలు ఉంటే ఆధారాలతో సమాధానం ఇవ్వాలని కోరారు.“అమర్‌నాథ్‌పై విమర్శలు చేయాలంటే ఆయన రాజకీయ విధానాలు, ప్రజా కార్యక్రమాలపై మాట్లాడాలి. వ్యక్తిగత వ్యాఖ్యలతో సమస్యలు పరిష్కారం కావు. సీఎం రమేష్ అయినా, మరెవరైనా ప్రజా సమస్యలపై వాస్తవాలతో మాట్లాడాలి. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు” అని కే.ఎం. నాయుడు అన్నారు.