📢 Advertisement Space

వైఎస్సార్ జగనన్న కాలనీలో ఘనంగా నిమజ్జనం

🗞️ బిబి న్యూస్ | 24 Sep 2026

కశింకోట: వైఎస్సార్ జగనన్న కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాల అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పేరూరి ఎన్‌వీఎం రామదాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించి, అనంతరం నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా భక్తులు వినాయక నామస్మరణలు, జైజై నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.కార్యక్రమంలో నిర్వాహకులు, స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.