నూకాంబిక దేవస్థానం అభివృద్ధిలో సేవలను గుర్తుచేస్తున్న స్థానికులు
అనకాపల్లి: ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరై ప్రారంభోత్సవాలు చేయడం, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడం సాధారణమే అయినప్పటికీ, ఒక దైవ కార్యాన్ని తన బాధ్యతగా భావించి భక్తిశ్రద్ధలతో దగ్గరుండి నిర్వహించే వారిలో దాడి జైవీర్ ప్రత్యేకంగా నిలుస్తున్నారని అనకాపల్లిలో పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో జైవీర్ చూపే ఆసక్తి, భక్తి, సేవాభావం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని వారు పేర్కొంటున్నారు.ముఖ్యంగా శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం నూతన అభివృద్ధి పనుల సమయంలో నిర్మాణాలను దగ్గరుండి పరిశీలించడం, ప్రతి అంశంపై శ్రద్ధ చూపడం ద్వారా ఆలయ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఈ అభివృద్ధి భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా ఉండాలని ఆయన చూపిన శ్రద్ధ అభినందనీయమని పలువురు చెబుతున్నారు.“పదవులు, ప్రచారం కంటే దైవసన్నిధిలో నిస్వార్థంగా చేసిన సేవే చిరస్థాయిగా నిలుస్తుంది” అనే భావనకు జైవీర్ చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఆయనను అభిమానించే వారు పేర్కొంటున్నారు.గవరపాలెం గౌరీపుత్రుడిగా దాడి జైవీర్ మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలని, శ్రీ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులతో ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.“దైవసేవే ధ్యేయం… భక్తియే బలం… సేవే చిరస్థాయి గుర్తింపు” అంటూ దాడి జైవీర్ ఆధ్యాత్మిక సేవలను పలువురు అభినందిస్తున్నారు.