అనకాపల్లిలో బీజేపీ బలోపేతంపై మాధవ్ దృష్టి....రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం
🗞️ బిబి న్యూస్ | 28 Sep 2026
సేవా కార్యక్రమాలు, బూత్ కమిటీలపై సమీక్ష
అనకాపల్లి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అనకాపల్లి పట్టణంలో పర్యటించారు. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు ఘన స్వాగతం పలికారు. పరమేశ్వరరావు శాలువాతో మాధవ్‌ను సత్కరించగా, జిల్లా బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ దాడి వీరునాయుడు పార్టీ కండువా కప్పి, భగవద్గీతను అందజేశారు.అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మాధవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులను కలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న సేవా, ప్రజా అవగాహన కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆయనకు వివరించారు.పార్టీ పరిస్థితి, బూత్ స్థాయి కమిటీల పనితీరు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై మాధవ్ నాయకులతో చర్చించారు. అనకాపల్లి పట్టణంలో జరుగుతున్న వార్డుల పునర్విభజన, కొత్త వార్డుల పరిధి, బూత్ స్థాయి కార్యకలాపాలపైనా సమీక్షించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు మరియు బీజేపీ జిల్లా ,మండల నాయకులు పాల్గొన్నారు.