అప్పన్న ఆలయానికి మూడో స్థానం. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలు
🗞️ బిబి న్యూస్ | 24 Feb 2026
సింహాచలం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయానికి రాష్ట్రంలో మూడో స్థానం లభించింది. ప్రతినెలా దేవాలయాల పరిధిలో తాగునీరు, పారిశుధ్యం, ప్రసాదాల నాణ్యత, క్యూల నిర్వాహణ తదితర అంశాలపై భక్తుల నుంచి ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తోంది. గత నెల (జనవరి)లో భక్తులు వ్యక్తీకరించిన అభిప్రాయాల ప్రకారం 76 పాయింట్లతో ద్వారకా తిరుమల దేవస్థానం అగ్రస్థానంలో నిలవగా, 75.1 పాయింట్లతో శ్రీకాళహస్తి రెండు, సింహాచలం దేవస్థానం మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రసాదాల రుచి, నాణ్యత విషయంలో 82.8 పాయింట్లతో, పారిశుధ్య నిర్వాహణలో 70.7 పాయింట్లతో సింహాచల దేవస్థానం అగ్రస్థానంలో ఉంది. దర్శనం విషయంలో మూడు, భక్తులకు తాగునీటి సదుపాయం కల్పించడంలో ఐదో స్థానంలో ఉంది.