📢 Advertisement Space

అనకాపల్లిలో ఘనంగా ‘నమో సేవా గాధ’ నాటిక ప్రదర్శన

🗞️ బిబి న్యూస్ | 30 Sep 2026

19 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల CMRF ఆర్థిక సహాయం
అనకాపల్లి, సెప్టెంబర్ 29: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “నమో సేవా గాధ” కార్యక్రమంలో భాగంగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో, సంస్కార భారతి–ఆంధ్రప్రదేశ్ సహకారంతో “నమో సేవా గాధ” నాటికను మంగళవారం ఘనంగా నిర్వహించారు.అనకాపల్లి నూకాలమ్మ ఆలయం సమీపంలోని శ్రీ సత్య లక్ష్మీ గ్రాండ్ మూడో అంతస్తులో సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం జరిగింది. సంస్కార భారతి–ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ పి.వి.ఎన్. కృష్ణ దర్శకత్వంలో నాటికను ప్రదర్శించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హాజరయ్యారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని “నమో సేవా గాధ” నాటికను వీక్షించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా 19 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పిల్లా రమాకుమారి, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రాంకీ, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, జిల్లా బీజేపీ ధార్మిక సెల్ అధ్యక్షుడు దాడి వీరునాయుడు, మాజీ శాసన మండలి సభ్యుడు బుద్ధ నాగ జగదీష్, అనకాపల్లి నియోజకవర్గ పరిశీలకురాలు అనంతలక్ష్మి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరం గణేష్, బి.ఎస్.ఎం.కె. జోగినాయుడు, బొద్దపు ప్రసాద్, సిద్ధిరెడ్డి శ్రీనివాసరావుతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.