అనకాపల్లిలో నేడు ‘సేవా జ్యోతి యాత్ర’ వికసిత్ భారత్ సంకల్ప సభతో ప్రారంభం.. అనంతరం మోటార్ సైకిల్ ర్యాలీ
🗞️ బిబి న్యూస్ | 06 Oct 2026
అనకాపల్లి, అక్టోబర్ 6: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం అనకాపల్లిలో ‘సేవా జ్యోతి యాత్ర’ నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తెలిపారు.ఉదయం 9 గంటలకు అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్లోని స్టేట్ బ్యాంక్ ఎదురుగా ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.సభ ముగిసిన అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభమై, అనకాపల్లి బైపాస్ రోడ్డులోని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వరకు కొనసాగుతుందని వెల్లడించారు. వివిధ మండలాల నుంచి పార్టీ శ్రేణులు మోటార్ సైకిళ్లతో తరలివచ్చి ‘సేవా జ్యోతి యాత్ర’లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్, అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ ఏపీఆర్ చౌదరి హాజరుకానున్నట్లు తెలిపారు.‘సేవే సంకల్పం – అభివృద్ధే లక్ష్యం – వికసిత్ భారత్ మన ధ్యేయం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పేర్కొన్నారు.